News

టీ తాగడంపై పాక్ ఆంక్షలు!

412views

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్ తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకుపోవడంతో, దేశ ఆర్థిక వ్యవస్థను ఎలా దారిలోకి తీసుకు రావాలో తెలియక అక్కడి ప్రభుత్వం అతలాకుతలమైపోతోంది. పతనం అంచున ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడేందుకు తమ ప్రజలు టీ వినియోగాన్ని తగ్గించుకోవాలని ఒక ఫెడరల్ మంత్రి పౌరులను కోరినప్పుడు పాకిస్తాన్ ప్రభుత్వం నిరాశ, నిస్పృహలు ఎంతటి పతాక స్థాయికి చేరుకున్నాయో అర్థ‌మ‌వుతోంది.

ఆర్థిక వ్యవస్థను కాపాడే ప్రయత్నంలో “ఒక కప్పు టీని తగ్గించమని నేను దేశ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను” అని ప్లానింగ్, అభివృద్ధి, ప్రత్యేక కార్యక్రమాల మంత్రి అహ్సాన్ ఇక్బాల్ ప్రకటించారు. విదేశీ మారక నిల్వలు తగ్గిపోతుండడంతో దేశంలో దిగుమతి ఖర్చులను తగ్గించుకోవడానికి దేశ ప్రజలు తేనీరు సేవనంపై త్యాగం చేయాలని ఆయన కోరారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి