
గుంటూరు జిల్లా తూములూరు గ్రామంలో 14 జూన్ 2022 మంగళవారం నాడు ఏరువాక పున్నమి ఘనంగా జరిగింది. భారతీయ కిసాన్ సంఘ్ మరియు గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం ఆధ్వర్యంలో సంయుక్తంగా జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ పద్మశ్రీ వెంకటేశ్వరరావు, భారతీయ కిసాన్ సంఘ్ అఖిల భారతీయ కార్యకారి సదస్యులు శ్రీ జలగం కుమారస్వామి మరియు ప్రకృతి ఆధారిత వ్యవసాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ భరత్ వర్మ, భారతీయ కిసాన్ సంఘ్ నాయకులు సామిరెడ్డి, జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 70 సంవత్సరాలు దాటిన రైతులను, యువ రైతులను ఘనంగా సత్కరించారు. తదుపరి పెద్దఎత్తున వర్షం రావడంతో రైతులు సంతోషపడ్డారు. రాబోయే సంవత్సరం ఏరువాక పున్నమిని మరింత ఘనంగా నిర్వహించాలని ఈ సమావేశంలో తీర్మానించారు.







