News

వకుళామాత ఆలయాన్ని త్వరితగతిన పూర్తి చేయాలి

454views

తిరుప‌తి: పేరూరు సమీపంలోని శ్రీ వకుళమాత ఆలయ పునర్నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని టీటీడీ ఈవో ఎ వి ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుపతి లోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో సోమవారం సాయంత్రం ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ ధర్మారెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో చిన్న పొరబాటుకు కూడా అవకాశం ఇవ్వరాదని చెప్పారు.

ఆలయానికి సంబంధించిన ఫ్లెక్సీలు, పబ్లిక్ అడ్రసింగ్ సిస్టం (మైక్ సెట్), ప్రజలు ఎండ వేడిమితో ఇబ్బంది పడకుండా జర్మన్ షెడ్లు వేసి అవసరమైనన్ని ఫ్యాన్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. భద్రత ఏర్పాట్లు పగడ్బందీగా చేయాలని, సిసి టీవీలు ఏర్పాటు చేయాలన్నారు. శ్రీవారి సేవకులు, అవసరమైనంత మంది సిబ్బందిని డిప్యూట్ చేసి గుర్తింపు కార్డులు జారీ చేయాలని ఈవో అధికారులకు సూచించారు. అన్నప్రసాదాల తయారీ, రవాణా ఏర్పాట్ల పై అధికారులతో చర్చించారు. కార్యక్రమం విజయవంతం చేయడానికి జిల్లా అధికార యంత్రాంగం తో సమన్వయం చేసుకోవాలన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి