News

ఆన్‌లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్‌ చట్ట విరుద్ధం

396views
  • ప్రకటనలు ప్రచురించవద్దని ప్రింట్ ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాకు కేంద్రం ఆదేశాలు

న్యూఢిల్లీ: ఆన్​లైన్​ బెట్టింగ్​ ప్లాట్​ఫామ్స్ ప్రచార ప్రకటనలకు దూరంగా ఉండాలని ప్రింట్​, ఎలక్ట్రానిక్​, డిజిటల్​ మీడియాలకు అడ్వైజరీ జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. దేశంలోని చాలా ప్రాంతాల్లో ఆన్​లైన్​ బెట్టింగ్​, గ్యాంబ్లింగ్​ చట్ట విరుద్ధమని పేర్కొంది. వీటిని వినియోగిస్తున్న వారికి ఆర్థిక, సామాజిక నష్టాన్ని పెంచుతాయని కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇటీవల ప్రింట్​, ఎలక్ట్రానిక్​, సోషల్​​, ఆన్​లైన్​ మీడియాల్లో ఆన్​లైన్​ బెట్టింగ్​ వెబ్​సైట్స్​ ప్రకటనలు పెరుగుతున్న తరుణంలో కేంద్రం ఈ అడ్వైజరీ జారీ చేసింది. ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ మేరకు సూచనలు చేసినట్టు పేర్కొంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి