News

బాలికపై అత్యాచారం.. బైక్ తో సహా నిందితుల సజీవదహనం

497views

జార్ఖండ్లోని గుమ్లాలో దారుణం చోటు చేసుకుంది. లిఫ్ట్ ఇస్తానని చెప్పి ఓ 16ఏళ్ల బాలికను బైక్ పై ఎక్కించుకొని తీసుకెళ్లి ఇద్దరు యువకులు ఆమెపై అత్యాచారం చేశారు. అయితే… విషయం తెలుసుకున్న గ్రామస్థులు నిందితులను బైక్ తో సహా సజీవ దహనం చేశారు. జరిగిన ఘటన గురించి తెలుసుకున్నవారు గ్రామస్థుల చర్యను అభినందిస్తున్నారు. అలాంటివారికి అలాంటి శిక్షే తగినదని వ్యాఖ్యానిస్తున్నారు. అన్ని చోట్లా అలాగే జరగాలని, అప్పుడైతేనే ఆడపిల్లలపై అత్యాచారాలకు తెర పడుతుందని అంటున్నారు. సంఘటన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.