News

పోలీసు కస్టడీలో హైదరాబాద్ రేప్ కేసు నిందితుడు సాదుద్దీన్

251views

* అత్యాచార ఘటన సీన్ ను రీ – కన్‌స్ట్రక్షన్ చేయనున్న పోలీసులు

జూబ్లీహిల్స్ ‌లో బాలికపై సామూహిక అత్యాచారం కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. కేసులో ఏ-1గా ఉన్న సాదుద్దీన్‌ మాలిక్ ‌ను చంచల్ ‌గూడ జైలు నుంచి పోలీసులు కస్టడీకి తీసుకున్నారు.

కేసుకు సంబంధించి పూర్తిస్థాయిలో విచారించాల్సి ఉన్నందున సాదుద్దీన్ ‌ను కస్టడీకి ఇవ్వాలని పోలీసులు గతంలో కోరిన సంగతి తెలిసిందే. దీంతో నేటి నుంచి ఈ నెల 12వ తేదీ వరకు కస్టడీకి కోర్టు అనుమతించింది. సాదుద్దీన్ ‌ను ప్రశ్నిస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయని భావిస్తున్న పోలీసులు అత్యాచార ఘటనను సీన్ రీ – కన్‌స్ట్రక్షన్ చేయనున్నారు. పబ్ ‌లో జరిగిన సంఘటనలు, బాలికను ట్రాప్ చేసిన అంశాలపైనా విచారించనున్నారు.

కేసులో ఇప్పటికే పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు. ఇందులో ఐదుగురు మైనర్లు కాగా, సాదుద్దీన్ ఒక్కడే మేజర్. మిగిలిన అయిదుగురు మైనర్ల కస్టడీ కోరుతూ మంగళవారం జువైనల్‌ కోర్టులో పోలీసులు పిటిషన్‌ దాఖలు చేశారు. మరోవైపు మైనర్ల కుటుంబ సభ్యులు బుధవారం జువైనల్‌ కోర్టులో బెయిలు పిటిషన్‌ దాఖలు చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.