
మునుపెన్నడూ లేనంతగా పొరుగు దేశాలకు భారత్ తన హార్థిక సహకారాన్ని అందిస్తూండడం ఓ గొప్ప పరిణామం. దాని కారణంగా మన దేశం ప్రపంచ వ్యాప్తంగా గౌరవ మన్ననలను పొందటమే కాకుండా, ఓ ప్రబల శక్తిగా కూడా రూపొందుతున్నది. కరోనా సంక్షోభ సమయంలో ప్రపంచంలోని 80 దేశాలకు భారత్ వ్యాక్సిన్ ను అందించిన సంగతి తెలిసిందే. అలాగే ఆఫ్ఘనిస్థాన్, శ్రీలంకలకు ఆహారాన్ని అందించటం వంటివి కూడా…
అలాగే చైనాతో యుద్ధ వాతావరణం నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ వియత్నాంకి కూడా తన సాయాన్ని అందించింది. వియత్నాం కోసం భారత్ తయారు చేసిన 12 హై స్పీడ్ గార్డ్ బోట్స్ ను రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ ఆ దేశానికి అప్పగించారు. ఈ 12 బోట్ల తయారీకి 100మిలియన్ డాలర్లను రుణంగా భారత్.. వియత్నాంకు అందించింది. ఈ సందర్భంగా రాజ్ నాథ్ మాట్లాడుతూ.. ‘ఈ ప్రాజెక్ట్ మేక్ ఇన్ ఇండియా- మేక్ ఫర్ ది వరల్డ్ మిషన్ కు అద్భుత ఉదాహరణ. వియత్నాం వంటి మిత్రదేశానికి రక్షణ పరికరాలు ఇవ్వడంలో భాగమైనందుకు సంతోషిస్తున్నాం’ అని రాజనాథ్ పేర్కొన్నారు.





