
471views
సైఫాబాద్: ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా తెలంగాణలోని సైఫాబాద్ టంకశాలలో మ్యూజియం ఏర్పాటుచేయాలని కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ‘సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎస్‌పీఎంసీఐఎల్) సంకల్పించింది. ఈ మేరకు ఏడు నెలల క్రితం పనులు మొదలుపెట్టారు. 1901 నాటి ఈ భవనం శిథిలావస్థకు చేరుకోగా పునరుద్ధరించడంతోపాటు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. మంగళవారం ఎస్‌పీఎంసీఐఎల్ సంస్థ ఛైర్మన్, ఎండీ త్రిప్తిఘోష్ దీన్ని ప్రారంభించారు.



