
468views
లక్నో: ఉత్తరప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లోని ఆరు ఆర్ఎస్ఎస్ కార్యాలయాలను బాంబులతో పేల్చివేస్తామని వాట్సాప్‌లో బెదిరింపు సందేశం వచ్చింది. లక్నో, ఉన్నవ్ నగరాల్లోని ఉన్న కార్యాలయాలను పేల్చివేస్తామని సోమవారం రాత్రి వాట్సాప్‌లో ఓ వ్యక్తి బెదిరింపు మెసేజ్ పంపించాడు. సందేశాలు పంపిన రాజ్ మహ్మద్ అనే వ్యక్తిని తమిళనాడు పోలీసులు పట్టుకున్నారు.
ఉత్తరప్రదేశ్ ఏటీఎస్ ఇచ్చిన సమాచారం మేరకు తమిళనాడులోని పుదుకోడి జిల్లాకు చెందిన మహ్మద్‌ను రాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. యుపి ఎటిఎస్ బృందం ఇప్పుడు అనుమానితుడిని ట్రాన్సిట్ రిమాండ్‌పై లక్నోకు తీసుకువస్తుంది. ఈ బెదిరింపు మెసేజ్ ఆర్ఎస్ఎస్ కార్యకర్త ప్రొఫెసర్ నీలకాంత్ తివారికి సోమవారం రాత్రి వచ్చింది. అంతర్జాతీయ ఫోన్ కాల్ నుంచి ఈ బెదిరింపు మెసేజ్ హిందీ, ఇంగ్లీషు, కన్నడ భాషల్లో వచ్చింది.
Source: NationalistHub





