News

కశ్మీర్ : ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం

281views

మ్ముకశ్మీర్‌లో మంగళవారం భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఇద్దరు మిలిటెంట్లను మట్టుబెట్టారు. కుప్వారా వద్ద చకత్రాస్‌ ఖండీ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకొంది.

చకత్రాస్‌ ఖండీ వద్ద ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం అందుకొన్న పోలీసులు, సైన్యం గాలింపు నిర్వహిస్తుండగా హఠాత్తుగా ముష్కరులు కాల్పులు మొదలుపెట్టారు. దీంతో బలగాలు కూడా ఎదురుదాడి చేశాయి. ఈ ఘటనలో పాకిస్థాన్ ‌కు చెందిన ఉగ్రవాది సహా ఇద్దరు మరణించారు. ఈ విషయాన్ని కశ్మీర్‌ ఐజీ విజయ్‌ కుమార్‌ ధ్రువీకరించారు. మరణించిన వారిలో ఒకరిని పాకిస్థాన్ ‌కు చెందిన తౌఫిల్‌గా గుర్తించారు. ఈ ఉగ్రవాదులు లష్కరే తోయిబాకు చెందిన వారిగా నిర్ధారించారు. ఘటన జరిగిన ప్రదేశాన్ని భద్రతా దళాలు జల్లెడ పడుతున్నాయి.

ఈ ఆపరేషన్‌లో 22 రాష్ట్రీయ రైఫిల్స్‌, 9 పారా కమాండోలు, సీఆర్‌పీఎఫ్‌, జమ్ముకశ్మీర్‌ స్పెషల్‌ ఆపరేషన్‌ గ్రూప్‌ పాల్గొన్నాయి. ఒక ఏకే రైఫిల్‌, ఐదు మ్యాగజైన్లు, ఇతర పేలుడు పదార్థాలను దళాలు స్వాధీనం చేసుకొన్నాయి. ఇటీవల కాలంలో కశ్మీర్ అల్ప సంఖ్యాక హిందువులను ‌లో టార్గెట్ గా‌ చేసుకొని ఉగ్రవాదులు హత్యలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భద్రతాదళాలు గస్తీని తీవ్రతరం చేశాయి. జనవరి నుంచి ఇప్పటి వరకు 28 మంది ఉగ్రవాదులను ఎన్‌కౌంటర్‌ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.