
236views
జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా చెక్ మొహల్లా నౌపొరాలో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య గురువారం నుంచి కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ కాల్పుల్లో శుక్రవారం ఇద్దరు ఉగ్రవాదులు హతం కాగా.. ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి. గాయపడిన జవాన్లను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు చెప్పారు. గురువారం ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంలో ఒక పౌరుడు గాయపడ్డారని పేర్కొన్నారు. ఆ ప్రాంతంలో ఉగ్రవాదులను ఏరిపారేసేవరకూ ఈ ఆపరేషన్ కొనసాగుతుందని తెలిపారు.





