News

ఇండియా గేట్ వద్ద నేతాజీ 30 అడుగుల విగ్రహం

503views
  • ప్రధాని మోడీని కలిసిన శిల్పి

న్యూఢిల్లీ: ఇండియా గేట్ వద్ద నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం ఏర్పాటు చేసేందుకు మైసూర్ నుంచి శిల్పి అరుణ్ యోగిరాజ్ న్యూఢిల్లీ చేరుకున్నారు. ఆగస్ట్ 15 కల్లా ఆయన ఈ విగ్రహాన్ని సిద్ధం చేస్తారు. సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్ డైరక్టర్ జనరల్ అద్వైత గడనాయక్ బృందం ఇప్పటికే తయారు చేసి ఫైనల్ చేసిన డిజైన్ ఆధారంగా యోగిరాజ్ ఈ 30 అడుగుల విగ్రహాన్ని చెక్కుతారు.

ఇందు కోసం ఆయనకు 25 మంది శిల్పులు సహకరిస్తారు. యోగిరాజ్ గతంలో కేదార్‌నాథ్ వద్ద ఏర్పాటు చేసిన 12 అడుగుల ఆదిశంకరాచార్య విగ్రహాన్ని చెక్కారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆది శంకరాచార్యుల విగ్రహాన్ని ఆవిష్కరించారు. మోదీ ట్విటర్ ద్వారా యోగిరాజ్ ప్రతిభను కొనియాడారు. యోగిరాజ్ గతంలో హనుమాన్, రామకృష్ణ పరమహంస తదితర మహనీయుల విగ్రహాలను కూడా చెక్కి ప్రశంసలు పొందారు. 37 సంవత్సరాల యోగిరాజ్ ఎంబీఏ చదివారు. 2008 నుంచి విగ్రహాలను చెక్కే పనిలో నిమగ్నమయ్యారు. ఈ గ్రానైట్ విగ్రహాన్ని ఇండియా గేట్ వద్ద ఆగస్ట్ 15న ప్రధాని మోదీ ఆవిష్కరిస్తారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి