News

ఇస్లామిక్ దేశాలకు భారత్ వార్నింగ్

725views

గ్ర‌వాదుల‌కు నిధులు స‌మ‌కూర్చిన కేసులో యాసిన్ మాలిక్ కు జీవిత ఖైదు శిక్ష విధించిన ఎన్ఐఏ ప్ర‌త్యేక కోర్టు తీర్పును కొన్ని ఇస్లామిక్ దేశాలు త‌ప్పు ప‌ట్ట‌డాన్ని భార‌త ప్ర‌భుత్వం తీవ్రంగా ఖండించింది.

ప్ర‌పంచానికి ప్ర‌మాద‌క‌రంగా త‌యారైన ఉగ్ర‌వాదాన్ని తాము ఎట్టి ప‌రిస్ఙ‌తుల్లో స‌హించబోమని భారత్ సదరు దేశాలకు స్పష్టం చేసింది. ఏ స్థాయిలో ఉన్నవారైనా, ఏ దేశమైనా ఉగ్రవాదుల్ని స‌పోర్ట్ చేస్తే ఎట్టిపరిస్థితుల్లోనూ ఊరుకోబోమని స్ప‌ష్టం చేసింది.

మాలిక్ పై వెలువ‌రించిన తీర్పుపై కామెంట్స్ చేసే హ‌క్కు ఇస్లామిక్ దేశాల‌కు లేద‌ని కుండ బ‌ద్ద‌లు కొట్టింది. త‌మ దేశ‌పు సార్వభౌమ‌త్వాన్ని ప్రశ్నించటం, లేదా ఇత‌ర ఏ విష‌యాల గురించైనా జోక్యం చేసుకోవడం వంటి వాటిని ఎట్టిపరిస్థితుల్లోనూ స‌హించబోమంటూ వార్నింగ్ ఇచ్చింది. హింస‌ను ప్రేరేపిస్తూ ఎంతో మందిని పొట్ట‌న పెట్టుకున్న తీవ్ర‌వాది యాసిన్ మాలిక్ ‌కు ఉరిశిక్షే క‌రెక్టు అని భారత్ పేర్కొంది. కానీ ద‌య‌త‌లిచి ప్ర‌త్యేక కోర్టు జీవిత ఖైదు విధించింద‌ని తెలిపింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.