News

ఈ ఏడాది చివరికల్లా గతిశక్తి రవాణా రైళ్లు

477views

* మరింత చౌక, సౌకర్యవంతం, వేగవంతం కానున్న సరకుల రవాణా

వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్ల తరహాలోనే సెమీ హైస్పీడ్ సరకు రవాణా రైళ్లు కూడా సిద్ధం అవుతున్నాయి. ఈ ఏడాది చివరికల్లా ఈ రైళ్లు పట్టాలెక్కే అవకాశం కనిపిస్తుండగా.. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ వీటిని రూపొందిస్తోంది. గంటకు 160కి.మీ వేగంతో ప్రయాణించే ఈ రైళ్ల తయారీకి ఒక్కొక్క దానికీ రూ.115 కోట్లు ఖర్చు కానుంది. మొత్తానికి ఈ రైళ్ల రాకతో సరకు రవాణా వ్యవస్థ దేశంలో మరింత వేగం పుంజుకోనుంది. రోడ్డు రవాణా వ్యవస్థతో పోలిస్తే రైలు రవాణా మరింత చౌకగానూ, సౌకర్యవంతంగానూ, వేగవంతంగానూ ఉండనుంది. మోడీ ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యతో రవాణా వ్యవస్థ ఎంతగానో మెరుగు పడడమే కాక వస్తువుల ధరలు కూడా మరింత అదుపులోకి వచ్చే అవకాశం కూడా వున్నదని రవాణా వ్యవస్థకు చెందిన పలువురు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.