
* టిప్పూ ఆలయ భూములను ఆక్రమించి ప్యాలెస్ నిర్మించాడంటున్న హిందూ జన జాగృతి సమితి
జ్ఞానవాపి, కుతుబ్ మినార్, మథుర వివాదాలు ఓవైపు కొనసాగుతుండగానే, మరో డిమాండ్ తెరపైకి వచ్చింది. మైసూరులోని టిప్పు సుల్తాన్ ప్యాలెస్ స్థలంలో సర్వే నిర్వహించాలని హిందూ జన జాగృతి సమితి డిమాండ్ చేస్తోంది. టిప్పూ సుల్తాన్ ఆలయ భూములను ఆక్రమించి ఆ ప్యాలెస్ ను నిర్మించాడని హిందూ జన జాగృతి సమితి వాదిస్తోంది. 15వ శతాబ్దంనాటి కోటే వేంకటరమణ స్వామి దేవాలయం భూములను ఆక్రమించుకుని ఈ ప్యాలెస్ ను నిర్మించారని హిందూ జన జాగృతి సమితి ఆరోపించింది. హిందూ జన జాగృతి సమితి ప్రతినిధి మోహన్ గౌడ మాట్లాడుతూ, టిప్పు సుల్తాన్ ప్యాలెస్ స్థలంలో సర్వే చేయాలని కోరారు. కోటే వేంకట రమణ స్వామి దేవాలయం భూములను టిప్పు సుల్తాన్ ఆక్రమించుకుని ఈ ప్యాలెస్‌ను నిర్మించినట్లు అనేక మంది చెప్పారన్నారు. ఈ స్థలంలో అప్పట్లో వేదాలను బోధించేవారని చెప్పారు. ఈ భూమిని అసలు యజమానికి (దేవాలయానికి) బదిలీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.





