News

యు.పి : పిల్లల్ని గొలుసులతో కట్టేసి… మదర్సాలో టార్చర్

400views

* స్థానికుల ఆగ్రహం

 

యూపీలోని లక్నోలో గల ఒక మదర్సాలో ఇద్దరు పిల్లలను గొలుసులతో కట్టిపడేశారు. అబ్బాయిల కాళ్లను చైన్లతో కట్టి బంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా పోలీసుల దృష్టికి వెళ్ళింది. లక్నోలోని మదర్సా నుంచి పారిపోకుండా ఉండేందుకు ఇద్దరు పిల్లలను కాళ్లకు గొలుసులతో కట్టి బంధించారు. తల్లిదండ్రులు మదర్సాలో చదువుకునేందుకు తమ ఇద్దరు అబ్బాయిలను చేర్పించారు.. పిల్లలు పారిపోయే అవకాశం ఉందని మౌలానాకు చెప్పుకొచ్చారు. దాంతో మౌలానా ఆ ఇద్దరి పిల్లలను గొలుసులతో కట్టి బంధించాడు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు రావడంతో పోలీసులు మదర్సాకు వెళ్లారు. ఆ పిల్లలను విడిపించిన పోలీసులు.. ఎందుకు ఇలా గొలుసులతో బంధించారని ప్రశ్నించారు. తమ పిల్లల పట్ల కఠినంగా ఉండమని తామే మౌలానాకు చెప్పామని.. మదర్సా నిర్వాహకులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని వ్రాతపూర్వకంగా పిల్లల తల్లిదండ్రులు వివరణ ఇచ్చారు.

 

మొదట మదర్సా నుంచి పారిపోతున్న 13, 14 ఏళ్ల పిల్లల పాదాలకు ఇనుప సంకెళ్లను చూసి గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. మౌలానా మొహమ్మద్ రియాజే ఈ పని చేశాడని తెలుసుకున్నారు. దీంతో గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ ‌గా మారడంతో పోలీసులు అక్కడికి చేరుకుని ఆ పిల్లలిద్దరినీ పోలీస్ స్టేషన్ ‌కు తీసుకొచ్చారు. ఇన్‌స్పెక్టర్‌ గోసైంగంజ్‌ శైలేంద్ర గిరి తెలిపిన వివరాల ప్రకారం బారాబంకిలో నివసిస్తున్న 13 ఏళ్ల పిల్లాడి తల్లిదండ్రులు మంచి చదువు కోసం పిల్లాడిని మదర్సాలో విడిచిపెట్టామని చెప్పారు. అయితే రంజాన్ సెలవులు కావడంతో పిల్లలు మదర్సాకు వెళ్లేందుకు ఇష్టపడలేదు. అయినప్పటికీ పిల్లల తల్లిదండ్రులు బలవంతంగా పిల్లల్ని మదర్సాలో విడిచిపెట్టారు. తమ పిల్లల పట్ల కఠినంగా వ్యవహరించమని తల్లిదండ్రులే మౌలానాకు సూచించారు. దాంతో మౌలానా పిల్లలను చైన్స్ తో కట్టిపడేశాడు. ఈ మొత్తం వ్యవహారంలో పిల్లల తల్లిదండ్రుల తప్పిదం కూడా ఉన్నదని, మౌలానా తో పాటు పిల్లల పట్ల నిర్దాక్షిణ్యంగా వ్యవహరించిన వారి తల్లిదండ్రులు కూడా శిక్షార్హులేనని స్థానికులు చర్చించుకుంటున్నారు.

 

NATIONALIST HUB సౌజన్యంతో….

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.