
న్యూఢిల్లీ: పాకిస్తాన్ సరిహద్దు నుంచి అనుమానాస్పద రీతిలో ఓ పావురం రావడం కలకలం సృష్టిస్తోంది. పావురం రెక్కలకు ఆంగ్ల భాషాక్షరాలు సహా గణాంకాల రూపంలో గూఢ భాషను రాసినట్టు అధికారులు గుర్తించారు. సంకేతాలతో కూడిన భాషను నిఘా విభాగం అధికారులు డీకోడ్ చేయడానికి శ్రమిస్తున్నారు.
సాధారణంగా పాక్ నుంచి భారత సరిహద్దులకు పావురాలు వస్తుంటాయి. అనుమానాస్పదంగా ఉన్నవాటిని అధికారులు అదుపులోకి తీసుకుంటారు. వాటి రెక్కలపై స్టాంప్లు, అంకెల విషయంలో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. వాటిని డీకోడ్ చేసి అది గూఢచర్యానికి సంబంధించినది కాదని నిర్ధరించుకున్న తర్వాతే వాటిని విడిచిపెడతారు.
ప్రస్తుతానికి పావురాన్ని పోలీస్ స్టేషన్లో ఉంచి అధికారులు తెలిపారు. ఇటీవలే సైన్యానికి సంబంధించిన రహస్య సమాచారాన్ని పాక్ మహిళకు చేరవేసిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో.. పావురం రెక్కలపై గూఢ భాష రాసి ఉండడం పలు సందేహాలను రేకెత్తిస్తోంది.





