News

ఉద్యమంగా మారుతున్న ‘కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం’

436views

నంద్యాల: కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం(మన ఊరు, మన గుడి, మన బాధ్యత) కార్య‌క్ర‌మం ఓ ఉద్య‌మంగా మారుతోంది. నంద్యాల జిల్లా, స్థానిక ప్రథమనంది దేవస్థానంలో గత ఏకాదశి రోజున లాంఛ‌నంగా కొద్ది మందితో ప్రారంభమైన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఇప్పుడు ఊపందుకున్న‌ది. తాజాగా, స్థానిక ఆర్టీసి బస్టాండు వద్ద గల శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానం పరిశుభ్రతా కార్యక్రమంలో భ‌క్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. తాము ఇటువంటి కార్య‌క్ర‌మంలో పాల్గొన‌డం ఎంతో ఆనందాన్ని ఇచ్చింద‌ని ప‌లువురు భ‌క్తులు పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి