News

మరోసారి శ్రీలంకకు 40 వేల టన్నుల డీజిల్ సాయం

496views
  • ఎనిమిది వేల టన్నుల బియ్యం

  • 200 టన్నుల పాల పొడి

  • ప్రాణాధార ఔషధాలు పంపిన భారత్

న్యూఢిల్లీ: శ్రీలంకకు ఎన్నో విధాలుగా సాయం అందిస్తున్న భారత్‌ మరో 40,000 టన్నుల డీజిల్‌ను శనివారం సరఫరా చేసింది. రుణ సాయాన్ని పొడిగించడంలో భాగంగా భారత్‌ డీజిల్‌ను అందజేసింది. అలాగే బియ్యం, ఔషధాలు, పాలపొడి వంటి అత్యవసర ఉపశమన సామగ్రితో భారత్‌ (చెన్నై) నుంచి ఓ నౌక కూడా శుక్రవారం బయల్దేరింది. ఇందులో దాదాపు రూ. 45 కోట్ల విలువైన 8,000 టన్నుల బియ్యం, 200 టన్నుల పాలపొడి, ప్రాణాధార ఔషధాలు ఉన్నాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి