News

ఆ పాస్ట‌ర్లు… భూ ఆక్ర‌మ‌ణ‌దారులు!

602views
  • లీజు రుసుం ఎగ‌వేత‌

  • స‌ర్కారు భూమిలో భ‌వ‌న నిర్మాణం

  • మ‌ధ్య‌ప్ర‌దేశ్‌కు రూ.7.62 కోట్ల నష్టం

  • కేసు న‌మోదు చేసిన ఇవోడ‌బ్ల్యు

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో ఆర్థిక మోసాలకు పాల్పడిన అయిదుగురు మెథడిస్ట్ చర్చి పాస్ట‌ర్ల‌పై ఎకనామిక్స్ అఫెన్సెస్ వింగ్(ఇవోడ‌బ్ల్యు) కేసు నమోదు చేసింది. భూ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ పాస్ట‌ర్ల వల్ల రాష్ట్రానికి రూ.7.62 కోట్ల నష్టం వాటిల్లింది. చర్చి య‌జ‌మానులు ప్రభుత్వ భూమిలో కొంత భాగాన్ని లీజుకు తీసుకున్నారు. కానీ, ప్ర‌భుత్వానికి లీజు మొత్తాన్ని ఎప్పుడూ చెల్లించలేదు. పైగా.. ప్రభుత్వ స్థలంలో అక్రమంగా భవనాన్ని నిర్మించుకున్నారు.

ఈ నెల ప‌దోతేదీన జబల్‌పూర్‌లోని మెథడిస్ట్ చర్చి మాజీ ఆఫీస్ బేరర్లపై ఇవోడ‌బ్ల్యు అధికారులు ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశారు. ప్రభుత్వ ఆస్తులను దుర్వినియోగం చేయడం, అక్క‌డే భ‌వనాన్ని అక్రమంగా నిర్మించడం వల్ల ఖజానాకు నష్టం వాటిల్లిందని ఇవోడ‌బ్ల్యు అధికారులు ఫిర్యాదు చేశారని ఫ్రీ ప్రెస్ జర్నల్ నివేదించింది. విచారణలో, సివిల్ స్టేషన్ నంబర్లు 4, 5, 8/1 ప్లాట్‌ను మెథడిస్ట్ చర్చ్ ఆఫ్ ఇండియా అక్రమంగా ఆక్రమించినట్టు అధికారులు గుర్తించారు.

2000 సంవత్సరంలో రెండు వేర్వేరు ప్లాట్ల లీజు ఒప్పందాన్ని పునరుద్ధరించడానికి చర్చి అధికారులు తహశీల్దార్‌ను సంప్రదించారని నివేదికలు చెబుతున్నాయి. అప్పటి రాంఝీ తహశీల్దార్ పునరుద్ధరణకు సిఫార్సు చేసి లీజు మొత్తాన్ని 2004లో ప్రభుత్వ ఖజానాకు జమ చేయాలని సూచించారు.

సిఫార్సు ఆధారంగా, జబల్‌పూర్ కలెక్టర్ భూమి లీజు పత్రాలను నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసి, లీజు మొత్తాన్ని జమ చేయాలని ఆదేశించారు. చర్చి అధికారులు మొత్తం చెల్లించలేదని, లీజు పత్రాలను నమోదు చేయలేదని ఇవోడ‌బ్ల్యు గుర్తించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి రూ.7,62,16,432 నష్టం వాటిల్లింది.

రెవ్ జాన్ ఆర్‌ఎస్ సైమన్(మెథడిస్ట్ చర్చ్ ఆఫ్ ఇండియా జబల్‌పూర్ జిల్లా సూపరింటెండెంట్), మనీష్ గిడియాన్(మెథడిస్ట్ చర్చ్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ), ఎంఏ డేనియల్(బిషప్ మెథడిస్ట్ చర్చి, చాపెల్ రోడ్ హైదరాబాద్, జబల్‌పూర్), రవికుమార్ ప్రసాద్(లే లీడర్), ఎరిక్‌నాథ్(ఇండియా మెథడిస్ట్ చర్చి కోశాధికారి, జబల్పూర్)లపై కేసు న‌మోదు అయింది.

Source: HINDU POST

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి