
-
ఉత్తర ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది
కశ్మీర్: కశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని సజీవంగా ఉంచడానికే మిలిటెంట్లు కశ్మీరీ పండిట్‌లను, స్థానికేతర కార్మికులను లక్ష్యంగా చేసుకుని హత్యలకు పాల్పడుతున్నారని ఉత్తర ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది తెలిపారు.
జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలను స్పాన్సర్ చేయడం మానేయాలని అంతర్జాతీయంగా పాకిస్తాన్ ఒత్తిడిని ఎదుర్కొంటుందన్నారు. ఈ పరిస్థితి నుంచి తప్పించుకోవడానికి కశ్మీర్ లోయలో తాను పెంచి, పోషించిన ఉగ్రవాదులకు భారత్ రంగు పూస్తోందని ద్వివేది విమర్శించారు.
ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టి ఆర్ ఎఫ్), పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్ (పిఎఎఫ్ఎఫ్), గజ్నవి ఫోర్స్, యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్, గిలానీ ఫోర్స్, లష్కరే-ఇ-ముస్తఫా, లషర్-ఎ-ఇస్లాం, జమ్మూకశ్మీర్ ఫ్రీడమ్ ఫైటర్ వంటి ఉగ్రవాద సంస్థలు పుట్టుకొచ్చాయని చెప్పారు. నివేదికల ప్రకారం, గత ఏడాదిన్నర కాలంలో జరిగిన ఉగ్రవాద దాడులకు, ముఖ్యంగా లోయలో హిందువుల లక్ష్యంగా జరిపిన హత్యలకు వీరే బాధ్యులని స్పష్టం చేశారు.
Source: Nijamtoday





