
భోపాల్: ఉత్తరప్రదేశ్ తరహాలోనే మధ్యప్రదేశ్‌లోనూ మదర్సాలలో జాతీయగీతాలాపనను తప్పనిసరి చేయనున్నారు. ఈ మేరకు మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా సంకేతాలు ఇచ్చారు. మదర్సాలలో జాతీయ గీలాతాపనను తప్పనిచేసే విషయాన్ని పరిశీలిస్తున్నట్టు చెప్పారు. జాతీయగీతం ఎక్కడైనా పాడుకోవచ్నని, అది చాలా మంచిదని అన్నారు. మధ్యప్రదేశ్‌లోనూ యూపీ తరహాలో నిర్ణయం తీసుకోనున్నారనే అనే మీడియా ప్రశ్నకు, ఇది కచ్చితంగా పరిశీలించాల్సిన అంశమేనని, పరిశీలిస్తామని మంత్రి సమాధానమిచ్చారు.
పాకిస్థాన్‌లో పాడమన్నామా?….
కాగా, అక్కడా ఇక్కడా అని కాకుండా దేశంలోని అన్ని విద్యా సంస్థల్లోనూ జనగణమన గీతాలాపన చేయాలని మధ్యప్రదేశ్ బీజేపీ చీఫ్ విష్ణు దత్ శర్మ అన్నారు. ”జాతీయగీతాన్ని పాకిస్థాన్‌లో పాడమని మేము చెప్పడం లేదు. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ సహా దేశం నలుమూలల్లోనూ విద్యాసంస్థల్లో జాతీయ గీతం పాడటం, భారత్ మాతా కీ జై నినాదాలు చేయడం జరగాలని మాత్రమే మేము చెబుతున్నాం” అని శర్మ తెలిపారు. ఇందుకు అనుగుణంగా తీసుకునే నిర్ణయాలను తాము స్వాగతిస్తామని అన్నారు.