News

దుర్గమ్మ కానుక‌ల దొంగ‌ను పట్టుకున్న పోలీసులు

31views

విజ‌య‌వాడ‌: విజయవాడ దుర్గగుడి హుండీల లెక్కింపులో కానుక‌లు కాజేసిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. దేవ‌స్థానానికి చెందిన ఓ చిరుద్యోగే ఈ ప‌ని చేసిన‌ట్టు నిర్ధరించారు. కొద్ది రోజుల కిందట మ‌హామండ‌పం ఆరో అంత‌స్తులోని బాత్‌రూంలో ఉన్న బంగారు ఆభ‌ర‌ణాల ప్యాకెట్‌ను ఎస్​పీఎఫ్​ సిబ్బంది గుర్తించారు. ఈవో ఫిర్యాదుతో రంగంలోకి దిగిన వ‌న్‌టౌన్ పోలీసులు.. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించారు. 110మంది సేవ‌కులు, ఉద్యోగులు లెక్కింపులో పాల్గొన్నారని తెలిపారు. నిందితుడి వివరాలు త్వరలో వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి