News

దేశ సర్వతోముఖాభివృద్ధికి ప్రధాని మోదీ నాయకత్వం

460views
  • పుస్తకావిష్కరణ సభలో అమిత్ షా

న్యూఢిల్లీ: దేశ సర్వతోముఖాభివృద్ధికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం వహిస్తున్నారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. మోదీ నాయకత్వంపై ప్రజలకు గట్టి నమ్మకం ఉందని, ఆయనను వారు తమ మనసు లోతుల నుంచి ప్రేమిస్తున్నారని తెలిపారు. Modi @ 20: Dreams Meet Delivery పుస్తకావిష్కరణ సభలో ఆయన బుధవారం మాట్లాడారు.

మోదీ ఎటువంటి కుటుంబ నేపథ్యం లేకుండానే దేశ నాయకునిగా ఎదిగారని, ఇది చాలా ముఖ్యమైన విషయమని తెలిపారు. ఆయన నాయకత్వంలో బీజేపీ అన్ని ప్రాంతాలకు విస్తరించిందన్నారు. అంతేకాకుండా పార్టీపై ప్రచారమైన అనేక ప్రతికూల అంశాలు పటాపంచలయ్యాయన్నారు. బీజేపీ అంటే హిందీ మాట్లాడేవారి పార్టీ అని, కేవలం పట్టణ ప్రాంతాల్లోనే దీనికి పలుకుబడి ఉందని, రైతుల పార్టీ కాదని జరిగిన ప్రచారాలను ఆయన నాయకత్వంలో తిప్పికొట్టగలిగినట్టు తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి