
* కోర్టులు, ప్రభుత్వం రెండూ లక్ష్మణరేఖ దాటకూడదు – కేంద్ర న్యాయ శాఖామంత్రి కిరణ్ రిజుజు
దేశద్రోహ చట్టం సెక్షన్ 124ఏ అమలుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు దేశద్రోహం కేసులు నమోదు చేయవద్దన్న సుప్రీం.. ఇప్పటికే నమోదైన కేసుల్లోనూ చర్యలు తీసుకోవద్దంది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కేసులు నమోదు చేయకూడదని ఆదేశించిన కోర్టు.. పౌరుల హక్కులు, దేశ సమగ్రత మధ్య సమతుల్యత అవసరమని అభిప్రాయపడింది. దేశద్రోహం కేసులో జైలులో ఉన్నవారు కోర్టులను ఆశ్రయించవచ్చని సుప్రీం తెలిపింది.
లక్ష్మణరేఖ దాటకూడదు – కేంద్ర న్యాయ శాఖామంత్రి కిరణ్ రిజుజు
దేశద్రోహ చట్టం అమలుపై స్టే విధిస్తూ సుప్రీంకోర్టు తన నిర్ణయాన్ని ప్రకటించిన అనంతరం కేంద్ర న్యాయ శాఖామంత్రి మాట్లాడుతూ “ప్రజాస్వామ్యంలో కోర్టులు ప్రభుత్వాన్ని గౌరవించాలి. అలాగే మేము కోర్టులను గౌరవిస్తాం. మనకు కొన్ని హద్దులు ఉన్నాయి. ఎవరు కూడా ఆ ‘లక్ష్మణ రేఖ’ని దాటకూడదు.” అని వ్యాఖ్యానించారు. ప్రభ్త్వ ఆకాంక్షకు విరుద్ధంగా కోర్టు నిర్ణయం తీసుకున్న ప్రస్తుత నేపథ్యంలో న్యాయ శాఖా మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.





