News

బాలిక‌పై అత్యాచారం, గృహిణిపై లైంగిక వేధింపులు!

541views

ల‌క్నో: ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్ జిల్లాలో రెండు అత్యాచార ఘటనలు సంచలనం సృష్టించాయి. మొదటి ఘటనలో ఓ వివాహిత స్నానం చేస్తున్న వీడియోను ఓ యువకుడు చిత్రీకరించాడు. ఆ వీడియోను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తాన‌ని బాధితురాలిని బెదిరించిన నిందితులు గతేడాది నుంచి ఆమెను లైంగికంగా వేధించారు. రెండో ఘటనలో బాలిక తన గదిలో నిద్రిస్తున్న సమయంలో అత్యాచారానికి గురైంది.

ఫిరోజాబాద్ జిల్లా రామ్‌గఢ్ ప్రాంతానికి చెందిన 32 ఏళ్ళ‌ వివాహిత, కాశ్మీర్ గేట్‌కు చెందిన ఫరీద్ అనే యువకుడు తన ఇంట్లో గతేడాది అద్దెకు ఉండేవాడని పోలీసులకు తెలిపింది. ఓ రోజు బాధితురాలి స్నానం చేస్తున్న వీడియోను రికార్డు చేసి, ఆ వీడియోను వైరల్ చేస్తానని బెదిరిస్తూ బ్లాక్ మెయిల్ చేశాడు. ఈ బెదిరింపులను ఉపయోగించి గత ఏడాది కాలంగా తరచూ ఆమెపై అత్యాచారం చేశాడు.

ఏప్రిల్ 26వ తేదీ రాత్రి ఎనిమిది గంటలకు ఫరీద్ ఆమె ఇంట్లోకి చొరబడి వేధించాడు. ఇంతలో బాధితురాలి భర్త సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని కొట్టాడు. నిందితుడిపై ఆమె రామ్‌గఢ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. రామ్‌గఢ్ స్టేషన్ ఆఫీసర్ హర్వేందర్ కుమార్ మిశ్రా తెలిపిన వివరాల ప్రకారం, ప్రస్తుతం పరారీలో ఉన్న ఫరీద్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

17 ఏళ్ళ బాలిక‌పై…

ఫిరోజాబాద్‌లోని కొత్వాలి నార్త్ పోలీస్ స్టేషన్ పరిధిలో 17 ఏళ్ళ బాలికపై సోను అనే యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాల పొరుగున ఉండే సోనూ తరచుగా బాధితురాలి ఇంటికి వచ్చేవాడు. ఏప్రిల్ 26వ తేదీ రాత్రి బాధితురాలు తన గదిలో నిద్రిస్తుండగా, ఆమె బంధువులు డాబాపై నిద్రిస్తున్నారు. పరిస్థితిని అనుకూలంగా మలుచుకున్న నిందితుడు ఆమె గదిలోకి ప్రవేశించి అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి కేకలు విన్న ఆమె బంధువులు తలుపులు పగులగొట్టి తలుపులు తీయగా, సోనూ పారిపోయాడు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసుల‌కు ఫిర్యాదు అందింది.

Source: HINDU POST

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి