
419views
-
పెరిగిన అసెంబ్లీ స్థానాలు
-
మొట్టమొదటిసారిగా గిరిజనులకు ప్రాధాన్యం
జమ్మూకశ్మీర్: కేంద్రపాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్‌లో నియోజకవర్గాల పునర్విభజన పూర్తయింది. డీలిమిటేషన్ కమిషన్ తన పదవీ కాలం పూర్తయ్యేందుకు ఒకరోజు ముందే పని పూర్తి చేసింది. రిటైర్డ్ జస్టిస్ రంజనా దేశాయ్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల కమిషన్ తుది ఆర్డర్స్‌పై సంతకాలు చేశారు.
జమ్మూ కశ్మీర్‌లోని అసెంబ్లీస్థానాల సంఖ్యను 83 స్థానాల నుంచి 90 స్థానాలకు పెంచాలని కమిషన్ ప్రతిపాదించింది. జమ్మూలో ఆరు స్థానాలు, కశ్మీర్‌లో ఒకటి కమిషన్ అదనంగా ప్రతిపాదించింది. చరిత్రలోనే తొలిసారి షెడ్యూల్డ్ ట్రైబ్స్‌కు తొమ్మిది సీట్లు కేటాయించింది. నియోజకవర్గాల సంఖ్య, విస్తీర్ణం వంటి వివరాలతో కూడిన గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత ఆర్డర్ కాపీ కేంద్ర ప్రభుత్వానికి సమర్పించనుంది.





