News

అహ్మదాబాద్‌లో పరశురాముడి బ్యానర్ల‌ ధ్వంసం: నలుగురి అరెస్టు

507views

అహ్మదాబాద్‌: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో పరశురామ జయంతి వేడుకలకు ముందు భగవాన్ పరశురాముడి బ్యానర్లను దుండగులు చించివేశారు. నగరంలోని వస్నా ప్రాంతంలోని భగవాన్ శ్రీ పరశురామ్ చౌక్ సైన్‌బోర్డ్‌ను కూడా వారు ధ్వంసం చేశారు. ఈ ఘటన మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. భగవాన్ పరశురాముడి విగ్రహంపై కర్రలతో దాడి చేయడమే కాకుండా, విగ్రహం సమీపంలో ఏర్పాటు చేసిన నాలుగు బ్యానర్లను కూడా చించివేశారు. ఈ ఘటన సీసీటీవీ కెమెరాలు రికార్డ‌యింది.

ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు శ్రీ సమస్ట్ గుజరాత్ బ్రహ్మసమాజ్ అహ్మదాబాద్ జిల్లా అధ్యక్షుడు హితేష్ త్రివేది తెలిపారు. పరశురామ జయంతి సందర్భంగా జీవరాజ్ పార్క్, వస్నా సమీపంలోని అంబాజీ ఆలయంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు త్రివేది తెలిపారు. తెల్లవారుజామున 2:30 గంటల ప్రాంతంలో అందరూ పని ముగించుకుని ఇంటికి బయలుదేరారు. 3:30 గంటల ప్రాంతంలో కొందరు దుండగులు పోస్టర్లను ధ్వంసం చేస్తున్నారని ఫోన్‌కాల్ వచ్చింద‌న్నారు. మంగళవారం ఉదయం తొమ్మిది గంటల సమయంలో నలుగురు దుండగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో ఒకరు జువైనల్ అని తెలిపారు.

Source: HINDU POST

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి