
494views
డెన్మార్క్: ఉక్రెయిన్‌లో తక్షణం కాల్పులను విరమించాలని, యుద్ధం ఆగాలని, చర్చలు, సంప్రదింపుల ద్వారా సంక్షోభానికి పరిష్కారం కనుక్కోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఐరోపా పర్యటనలో భాగంగా మంగళవారం ప్రధాని మోదీ డెన్మార్క్ చేరుకొని, ఆ దేశ ప్రధాని మెటె ఫ్రెడరిక్సెన్‌తో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఉక్రెయిన్ సంక్షోభం గురించి ఇద్దరూ చర్చించారు. భారత్ తన పలుకుబడిని ఉపయోగించి యుద్ధాన్ని విరమించడానికి రష్యాను ఒప్పించాలని డెన్మార్క్ ప్రధాని కోరారు. ఉక్రెయిన్‌లో యుద్ధం కారణంగా అమాయకులు ప్రాణాలు కోల్పోవడంపై ఇరుదేశాలు ఆందోళన వ్యక్తంచేశాయి. తక్షణమే శత్రుత్వాన్ని విడనాడాలని విజ్ఞప్తి చేశాయి.
Source: Nijamtoday





