
-
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్
భాగ్యనగరం: గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రూప్-1 పరీక్షను ఉర్దూలో రాసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించడం వెనుక మహా కుట్ర దాగి ఉందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. దీనివల్ల ఒక వర్గం వారికే ఉన్నత ఉద్యోగాలు పొందుతారని, హిందూ సమాజానికి భవిష్యత్‌లో ఆయా ఉద్యోగాలు పొందే అవకాశం కోల్పోతారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా 20వ రోజున దేవరకద్రలో గత రాత్రి జరిగిన బహిరంగసభలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఎంఐఎం చేతుల్లో పెట్టేందుకు కుట్ర జరుగుతోందని సంజయ్ మండిపడ్డారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ నిర్ణయాన్ని అంగీకరించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించేదాకా బీజైవైఎం ఆధ్వర్యంలో మహా పోరాటం చేయబోతున్నట్టు సంజయ్ ప్రకటించారు.
సీఎం కేసీఆర్ కుట్రపై బీజేవైఎం అధ్యక్షుడు భానుప్రకాష్ నేతృత్వంలో రాష్ట్రవ్యాప్తంగా హిందూ యువత తరఫున తాము పోరాడతామని, యువత కలిసి రావాలని పిలుపునిచ్చారు. ప్రాంతీయ భాషలకు బీజేపీ వ్యతిరేకం కాదని, కానీ, మత ప్రాతిపదికన ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడితే సహించేదిలేదని హెచ్చరించారు.
Source: Nijamtoday





