News

హనుమంతుడి విగ్రహంపై 786 ఉర్దూ పదాలు

552views

కోటా: రాజస్థాన్‌ రాష్ట్రం కోటా జిల్లాలోని ఓ ఆలయంలో హనుమంతుడి విగ్రహంపై ఉర్దూలో రాసిన స్లిప్‌ను అతికించిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ స్లిప్‌లో 786 అని కూడా రాసి ఉంది. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ సంఘటన ఏప్రిల్ 24, 2022 (ఆదివారం) జరిగినట్టు చెబుతున్నారు.

మీడియా కథనాల ప్రకారం.. ఈ సంఘటన కోట పరిధిలోని ‘అయన’ అనే గ్రామంలో చోటు చేసుకుంది. రాధేశ్యాం వైష్ణవ దేవాలయంలోని హనుమంతుడి విగ్రహంపై ఈ పనికి పాల్పడ్డారు. ఘటన జరిగిన రోజు రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఆలయంలో ఏర్పాటు చేసిన హనుమాన్ విగ్రహంపై ఉర్దూలో రాసిన స్లిప్‌ను అతికించారు.

పూజారి మొదటిసారి చూసి స్థానికులకు ఫిర్యాదు చేశారు. అనంతరం వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనతో ఆగ్రహించిన గ్రామస్తులు నిందితులని పట్టుకోవాలని పోలీసులకు 24 గంటల అల్టిమేటం జారీ చేశారు. నిర్ణీత గడువులోగా అరెస్టు చేయకుంటే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.

ఉద్రిక్తత దృష్ట్యా ఘటనా స్థలంలో అదనపు పోలీసు బలగాలను మోహరించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని పోలీసులు చెప్పారు. ఈ చర్య వెనుక మతపరమైన ఉద్రిక్తతలను రెచ్చగొట్టే కుట్ర ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) కూడా పోలీసులను కోరింది.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి