News

పీయూసీ ఫైనల్ పరీక్ష రాయకుండానే వెళ్ళిపోయిన ఇద్దరు పిటిషనర్లు!

605views

ఉడిపి: హిజాబ్ విషయమై కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఇద్దరు విద్యార్థినులు శుక్రవారం వార్షిక పరీక్ష రాసేందుకు నిరాకరించారు. హిజాబ్ ఘటనకు సంబంధించి ఇద్దరు పిటిషనర్లు అలియా అస్సాది, రేషమ్ లు శుక్రవారం కర్ణాటకలోని ఉడిపిలో ప్రీ-యూనివర్శిటీ కోర్సు (పీయూసీ) పరీక్ష రాయడానికి నిరాకరించి కళాశాల ప్రాంగణం నుంచి వెళ్ళిపోయారు.

ఉడిపిలోని విద్యోదయ పీయూ కాలేజీలో పరీక్షలు రాసేందుకు అలియా అస్సాది, రేషమ్ హాల్ టిక్కెట్లు తీసుకుని బురఖాలు ధరించి వచ్చారు. వారు దాదాపు 45 నిమిషాల పాటు ఇన్విజిలేటర్‌లను, కళాశాల ప్రిన్సిపాల్‌ను ఒప్పించేందుకు ప్రయత్నించారు కానీ, కోర్టు తీర్పు గౌరవించాలని పరీక్ష నిర్వాహకులు తెలిపారు. మినహాయింపు ఇవ్వమని వారికి తెలిపారు. ఆ తర్వాత వారు పరీక్షలకు హాజరుకాకుండా ప్రాంగణం నుంచి నిశ్శబ్దంగా వెళ్ళిపోయారు.

హిజాబ్ ధరించి పరీక్షలు రాయడానికి అనుమతించాలని ఈ నెల ప్రారంభంలో కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైని అలియా అస్సాదీ అభ్యర్థించిన సంగతి తెలిసిందే. ప్రతి ఒక్కరూ హైకోర్టు తీర్పును పాటించాలని, లేదంటే పరీక్ష రాయడానికి అనుమతించబోమని కర్ణాటక ప్రభుత్వం కూడా స్పష్టం చేసింది.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి