
605views
అల్లూరి: ఏపీ మన్యంలోని అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం పెదమాకవరం పంచాయతీ గానుగుల గ్రామంలో హనుమాన్ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా జరిపారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ హిందూ ధర్మ విశిష్టత, శ్రీరాముడు, జానకి మాత, లక్ష్మణుడు, హనుమాన్ గురించి వివరించారు. ధర్మ జాగరణ సమితి గిరిజన పరియోజన ప్రముఖ్ డీవీడీ ప్రసాద్, పంచాయతీ సర్పంచ్ సెగ్గే నూకాలమ్మ, ఎంపీటీసీ సడ్డా మల్లీశ్వరి పాల్గొన్నారు. అలాగే, హైందవ సైన్యం కొయ్యూరు మండల ప్రముఖ్ డుచ్చరి కృష్ణం రాజు, భజన గురువు నూకరాజు, పేదమాకవరం గ్రామ దేవతల పూజారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.





