News

రాజస్థాన్ ప్రభుత్వం వికృత చేష్ట‌లు… బుల్డోజ‌ర్‌తో ఆల‌యాల కూల్చివేత‌

553views

జ‌య‌పూర్‌: రాజ‌స్థాన్ ప్ర‌భుత్వం వికృత చేష్ట‌ల‌కు పాల్ప‌డుతోంది. హిందువుల మ‌నోభావాలు, విశ్వాసాల‌పై బుల్డోజ‌ర్‌తో దాడి చేస్తోంది. అభివృద్ధి పేరుతో అల్వార్ జిల్లా, రాజ్‌గఢ్‌లో చారితాత్మ‌క మూడు దేవాలయాలను శుక్ర‌వారం బుల్డోజర్‌తో కూల్చివేసింది, ఈ ఆలయాలలో 300 సంవత్సరాల నాటి శివాలయం కూడా ఉంది. దేవుని విగ్రహాలను కూడా ధ్వంసం చేశారు. పాదరక్షలు ధరించిన కార్మికులు విగ్రహాలపై కట్టర్ మిషన్ నడుపుతూ ప‌డ‌గొట్టారు. శివ‌లింగాన్ని క‌ట్ట‌ర్‌తో ధ్వంసం చేశారు. దీంతో భ‌క్తులు క‌న్నీటిప‌ర్యంత‌మ‌య్యారు.

Source: Aaj Tak, VSK Bharat, Panchjanya

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి