
-
తపాలా బిళ్ల, స్మారక నాణాన్ని విడుదల చేసిన మోదీ
న్యూఢిల్లీ: సిక్కుల గురువు తేగ్ బహుదూర్ 400వ జయంతి వేడుకల.. సందర్భంగా ఎర్రకోట వద్ద ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది కేంద్రం. ప్రధాని నరేంద్ర మోదీ హాజరై తేగ్ బహదూర్‌కు నివాళులర్పించారు. ప్రత్యేక తపాలా బిళ్ల, స్మారక నాణెం విడుదల చేశారు. అనంతరం తొలిసారిగా ఎర్రకోటలో సంప్రదాయానికి భిన్నంగా సూర్యాస్తమయం తర్వాత జాతినుద్దేశించి ప్రసంగించారు మోదీ.
ప్రకాశ్ పర్వ్ సందర్భంగా.. అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. మోదీ. సిక్కు గురువుల ఆదర్శాలను భారత్ అనుసరిస్తోందని, అందుకు సంతోషంగా ఉందని అన్నారు. ఈ పుణ్య తిథి పురస్కరించుకొని.. 10 మంది గురువుల పాదాలకు నమస్కరిస్తున్నానన్నారు.
స్వాతంత్ర వేడుకల సమయంలో ప్రసంగించే చోటు వద్ద కాకుండా మరో ప్రాంతంలో ఈ ప్రసంగాన్ని నిర్వహించారు. తేగ్ బహుదూర్‌కు మరణశిక్షకు అప్పటి మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ ఈ ఎర్రకోట నుంచే ఆదేశాలు జారీ చేసిన కారణంగా.. అందుకు ప్రతీకగా ఇక్కడే ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించినట్టు అధికారులు వెల్లడించారు.





