News

చైనా ఎకనామిక్ కారిడార్‌ను రద్దు చేసిన పాకిస్తాన్… ఇరు దేశాల సంబంధాల్లో పెను మార్పు

551views

ఇస్లామాబాద్‌: చైనా – పాకిస్థాన్‌ ఎకనమిక్‌ కారిడార్‌ (సీపీఈసీ) అథారిటీని రద్దు చేస్తూ షెహబాజ్‌ షరీఫ్‌ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రణాళికా మంత్రి అషన్‌ ఇఖ్బాల్‌ దీన్ని వనరులను వృథా చేసే ‘అనవసరమైన సంస్థగా ఆదేశాల్లో పేర్కొన్నారు. రూ.4.5 లక్షల కోట్ల (60 బిలియన్‌ డాలర్లు) ఈ ప్రాజెక్టుకు ఇమ్రాన్‌ సర్కారు 2019లో శ్రీకారం చుట్టింది.

బైనాలోని షిన్‌ జియాంగ్‌ ప్రావిన్సు నుంచి పాక్‌లోని బలూచిస్టాన్‌ ప్రావిన్సు పరిధిలో ఉన్న గదర్‌ ఓడరేవు నడుమ మౌలిక సదుపాయాలు, ఇంధన ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రణాళిక ఇది. ఇప్పటికే దీనిపై దాదాపు సగం వ్యయం చేసినట్టు చైనా చెబుతోంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి