News

ఏడుగురు పాక్ పౌరుల‌పై నిషేధం!

534views

న్యూఢిల్లీ: ఉగ్రవాదులకు నిధులను సమకూర్చుతూ, జమ్మూ-కశ్మీరులో దాడులకు పాల్పడుతున్నందుకు ఏడుగురు పాకిస్థాని పౌరుల‌పై భారత ప్రభుత్వం నిషేధం విధించింది. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం ప్రకారం వీరిపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ చర్యలను చేపట్టింది. జమ్మూ-కశ్మీరు సీఐడీ సిఫారసు మేరకు ఈ నిర్ణయం తీసుకుంది.

పాకిస్థాన్‌కు చెందిన సజ్జాద్ గుల్, అషిక్ అహ్మద్ నెంగ్రూ, ముష్తాక్ అహ్మద్ జర్గార్ (లట్రమ్), అర్జుమండ్ గుల్జార్ జాన్ (హంజా బుర్హాన్), అలీ కషిఫ్ జన్, మొహియుద్దీన్ ఔరంగజేబ్ అలంగిర్, హఫీజ్ టల్హా సయీద్‌లపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిషేధం విధించింది. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం ప్రకారం మొత్తం మీద 38 మంది పాకిస్థానీ పౌరుల‌పై నిషేధం విధించింది.

ఐక్యరాజ్య సమితికి, ఇతర దేశాలకు ఈ ఉగ్రవాదుల గురించి సమాచారం అందజేయడానికి వీలుగా ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. అంతేకాకుండా కొందరు వ్యక్తులు కశ్మీరు లోయలో ఉంటూ ఈ ఉగ్రవాదులకు సహకరిస్తున్నారు, అటువంటి వారికి గట్టి హెచ్చరికను పంపడానికి కూడా ఈ చర్యలు దోహదపడతాయి.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి