News

త్వరలో దక్షిణాది భాషల ఓటీటీలో ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’!

434views

ముంబై: ప్ర‌పంచ వ్యాప్తంగా సంచలనం కలిగించిన ‘ది కశ్మీర్ ఫైల్స్‌’ చిత్రాన్ని త్వరలో దక్షిణాది భాషల్లో ఓటిటీలో ప్రదర్శనకు సిద్ధమవుతున్నది. త్వరలోనే ఈ మూవీ హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్‌ కానుందని, తేదీలపై త్వరలో జీ5 అధికారిక ప్రకటన కూడా ఇవ్వునుంది.

ఈ విషయాన్ని స్వయంగా జీ5 చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌ మనీశ్‌ కల్రా ఇటీవల ఓ ఇంటర్య్వూలో వెల్లడించినట్టు ఓ నేషనల్‌ వెబ్‌సైట్‌ పేర్కొంది. దీని ప్రకారం ఈ మూవీ అతికొద్ది రోజుల్లోనే, అంటే మే మొదటి వారంలో జీ5లో విడుదల కానుందని ఆ మీడియాతో మనీశ్‌ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌కు దేశవ్యాప్తంగా ప్రేక్షకులు నుంచి భారీ రెస్పాన్స్‌ వస్తోంది. అందుకే జీ5లో కశ్మీర్‌ ఫైల్స్‌ను ఎక్స్‌క్లూసివ్‌గా స్ట్రీమింగ్‌ చేయబోతున్నాం’ అని ప్రకటించారు.

ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ సంచలనం సృష్టించింది. కేవలం రూ 10 కోట్ల బడ్జెట్‌తో ఎలాంటి స్టార్‌ కాస్ట్‌ లేకుండా వచ్చిన ఈ చిత్రం అందరి అంచనాలను తలికిందులు చేసింది. చిన్న సినిమా అయినప్పటికీ రూ. 250 కోట్లకుపైగా కలెక్షన్స్‌ రాబట్టింది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి