News

మతపరమైన ఉత్స‌వాల‌కు యోగి స‌ర్కార్ కొత్త నిబంధనలు

457views

ల‌క్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని యోగి ఆదిత్యనాథ్ సర్కారు మతపరమైన కార్యక్రమాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. సమావేశాలు, ఊరేగింపులకు నిర్వాహకుల నుంచి తప్పనిసరిగా అఫిడవిట్ (ప్రమాణపత్రం) తీసుకోవాలని ఆదేశించారు. సోమవారం రాత్రి ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి యోగి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.

రంజాన్, అక్షయ తృతీయ ఒకే రోజు వస్తున్నందున అప్రమత్తంగా ఉండాలని పోలీసు అధికారులను కోరారు. అనుమతి ఇచ్చే ముందే శాంతి, సామరస్యాన్ని కాపాడుతామంటూ నిర్వాహకుల నుంచి అఫిడవిట్ తప్పకుండా తీసుకోవాలని అన్నారు. సంప్రదాయంగా వస్తున్న మతపరమైన కార్యక్రమాలకే అనుమతి ఇవ్వండి. కొత్త కార్యక్రమాలకు అనుమతులు వద్దని యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి