
కర్నూలు: ఏపీలోని కర్నూలు జిల్లా, హోలగుంద మండల కేంద్రంలో హనుమాన్ జన్మదినోత్సవ శోభాయాత్ర పై కర్నూలు జిల్లాలో బలమైన పునాదులు నిర్మించుకున్న పీఎఫ్ఐ, ఎసీడీపీఐ జిహాదీ మతోన్మాద సంస్థల నాయకత్వంలో అల్లరిమూకలు రాళ్ళదాడికి పాల్పడ్డాయి. దీంతో పలువురు భక్తులకు గాయాలయ్యాయి.
మారుమూల గ్రామాల్లో కూడా విస్తరించిన మతోన్మాద సంస్థలు హనుమంతుని జన్మదినోత్సవ కార్యక్రమాలను నిర్వహించి కోకుండా రాళ్ళు విసరడం, చెప్పులు విసరడం అవమానకరమైన భాషను ప్రయోగించడం, ఆ గ్రామంలో ఉన్న ముఖ్య మార్గంలో శోభాయాత్ర నిర్వహించ కూడదు అని ఆంక్షలు విధించడం ఎంతవరకు సబబు అని హిందువులు ప్రశ్నిస్తున్నారు.
ఇప్పటివరకు కాశ్మీర్లో, మాత్రమే రాళ్ల దాడులు జరుగుతాయని వింటూ ఉండేవాళ్ళం కానీ ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్.., రాయలసీమలోని మారుమూల హోళగుంద గ్రామంలో సైతం రాళ్లవర్షం కురిపించడం సాధారణ భక్తుల మనసులను కలిచివేసింది.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.