News

విశాఖ‌లో వైభ‌వం…హ‌నుమ విజ‌యోత్స‌వ శోభాయాత్ర‌!

638views

విశాఖ‌ప‌ట్నం: హ‌నుమ జ‌యంతిని పుర‌స్క‌రించుకుని రామ‌భ‌క్తులు విశాఖ‌ప‌ట్నంలో భారీ ద్విచ‌క్ర వాహ‌న శోభాయాత్ర‌ నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మాన్ని శ్రీ‌పీఠం పీఠాధిప‌తి శ్రీ ప‌రిపూర్ణానంద స్వామిజీ, ఎమ్మెల్సీ మాధవ్‌, మాజీ ఎమ్మెల్యే పెన్మ‌త్స విష్ణుకుమార్ రాజు ప్రారంభించి, పాల్గొన్నారు. నగ‌రంలోని అక్క‌య్య‌పాలెంలో ప్రారంభ‌మైన ఈ యాత్ర‌ ఆర్‌కే బీచ్ కాళీమాత ఆల‌యం వ‌ద్ద ముగిసింది.

 

సీతారామ‌ల‌క్ష్మ‌ణ స‌మేత ఆంజ‌నేయ‌స్వామిని ప‌ల్ల‌కి ఉంచి ఊరేగించారు. ముగింపు కార్య‌క్ర‌మంలో ప‌రిపూర్ణానంద మాట్లాడుతూ, అతి త్వ‌ర‌లో సాధువులంతా హిందూపురం నుంచి ఇచ్ఛాపురం వ‌ర‌కు యాత్ర చేప‌ట్ట‌నున్నార‌న్నారు. 2027లో ఆంధ్ర రాష్ట్రంలో హ‌నుమాన్ ఓ మ‌హా యోధుడిలా నిల‌బ‌డ‌నున్నాడ‌ని, అప్పుడు పూర్తిస్థాయి కాషాయ రాజ్యం ఏర్ప‌డ‌నుంద‌న్నారు. రాష్ట్రానికి ప‌ట్టిన గ్ర‌హ‌ణాన్ని, శ‌నిని త‌రిమికొట్టేందుకు ప్ర‌తీ ఒక్క‌రూ హ‌నుమ‌లా మారాల‌ని స్వామిజీ పిలుపునిచ్చారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి