News

మత మార్పిడులపై అప్రమత్తం… గోవా సీఎం హెచ్చరిక

495views

గోవా: మత మార్పిడులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ హెచ్చరించారు. కుడ్నెమ్ దేవాలయ వ్యవస్థాపక దినోత్సవాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మరోసారి మతం దాడికి గురవుతోందని చెప్పారు. తాను అబద్ధాలు చెప్పడం లేదని పేర్కొన్నారు.

గోవాలోని వివిధ ప్రాంతాల్లో ప్రజలు మత మార్పిడులవైపు వెళ్తున్నట్టు మనం గమనిస్తున్నామని తెలిపారు. పేదరికం, అల్ప సంఖ్యాకులుగా ఉండటం, వెనుకబడిన తనం, ఆహారం కొరత, ఉద్యోగాలు లేకపోవడం వంటి కారణాలతో చాలా మంది మతమార్పిడికి గురవుతున్నారని చెప్పారు. ఇటువంటి పరిస్థితుల్లో మత మార్పిడులు జరగకూడదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

మత మార్పిడులను ప్రభుత్వం అనుమతించదని, అయితే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. గ్రామాల్లోని దేవాలయ ట్రస్టులు అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉందని పేర్కొన్నారు. కుటుంబాలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

అరవయ్యేళ్ళ క్రితం పోర్చుగీసు పాలనలో ఉన్న గోవాలో భగవంతుడు, మతం, దేశం అనే సెంటిమెంట్‌తో ముందుకు వెళ్ళామని గుర్తు చేశారు. మన దేవుడు సురక్షితంగా ఉంటే, మన మతం సురక్షితంగా ఉంటుందని, మన మతం సురక్షితంగా ఉంటే, మన దేశం సురక్షితంగా ఉంటుందని పేర్కొన్నారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి