News

భారత్ సరిహద్దుల్లో చైనా మొబైల్ టవర్స్ !

474views

న్యూఢిల్లీ: భారత్ సరిహద్దుల్లో చైనా సెల్ టవర్లను ఏర్పాటు చేసింది. పాంగాంగ్ సరస్సుపై వంతెనను నిర్మించిన తర్వాత చైనా ఈ మూడు టవర్లను హాట్ స్ప్రింగ్స్ ప్రాంతంలో ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని లడఖ్ లోని ఓ గ్రామ కౌన్సిలర్ కొన్‌చక్ స్టాంజిన్ ట్వీట్ చేశారు. సంబంధిత ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

పాంగాంగ్ సరస్సుపై వంతెనను పూర్తి చేసిన తర్వాత మూడు మొబైల్ టవర్లను భారత భూభాగానికి సమీపంలో చైనా హాట్ స్ప్రింగ్ సమీపంలో ఏర్పాటు చేసిందని.. ఇది ఆందోళన కలిగించే విషయమని తెలిపింది. తమ గ్రామాల్లో 4జీ సౌకర్యాలు కూడా లేవని.. ఇక్కడ 11 గ్రామాలు నియోజకవర్గంలో 4జీ సౌకర్యాలు లేవని కొన్‌చక్ స్టాంజిన్ ట్వీట్‌లో పోస్ట్ చేశారు. మూడు మొబైల్ టవర్ల ఏర్పాటును చేసి చైనా తన కమ్యూనికేషన్ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తోంది.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి