
-
మానవ హక్కుల ఉల్లంఘనంటూ నోరుపారేసుకుంటే సహించబోమని పరోక్ష హెచ్చరిక
న్యూఢిల్లీ: భారత దేశంలో మానవ హక్కుల ఉల్లంఘనలు పెరుగుతున్నాయని అమెరికా స్టేట్ సెక్రటరీ ఆంటోనీ బ్లింకెన్ చేసిన వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ ఘాటుగా స్పందించారు. భారత దేశ విధానాలపై అభిప్రాయాలను ఏర్పరచుకునే హక్కు ఎవరికైనా ఉందని, అయితే అదే సమయంలో వారి గురించి కూడా అభిప్రాయాలను ఏర్పరచుకునే హక్కు భారత దేశానికి అంతే సమానంగా ఉందని చెప్పారు.
ఇటీవల న్యూయార్క్‌లో సిక్కు మతానికి చెందిన ఇద్దరిపై విద్వేషపూరిత దాడి జరిగిన నేపథ్యంలో జైశంకర్ ఘాటుగా స్పందించారు. భారత్, అమెరికా 2 ప్లస్ 2 మినిస్టీరియల్ డయలాగ్‌లో పాల్గొనేందుకు విదేశాంగ మంత్రి జైశంకర్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అమెరికాలో పర్యటించారు.
ఈ చర్చల్లో అమెరికా స్టేట్ సెక్రటరీ ఆంటోనీ బ్లింకెన్, డిఫెన్స్ సెక్రటరీ లాయిడ్ ఆస్టిన్ పాల్గొన్నారు. ఈ చర్చల అనంతరం జరిగిన సంయుక్త విలేఖర్ల సమావేశంలో ఆంటోనీ బ్లింకెన్ మాట్లాడుతూ, భారత దేశంలో ఇటీవల జరుగుతున్న ఆందోళనకర పరిణామాలను అమెరికా పరిశీలిస్తోందన్నారు.
కాగా, జయశంకర్ మాట్లాడుతూ అమెరికాలోని న్యూయార్క్‌లో మంగళవారం ఇద్దరు సిక్కులపై విద్వేష దాడి జరిగింది. రిచ్‌మండ్ హిల్స్‌లో ఉదయం వాకింగ్‌కు వెళ్ళిన ఈ ఇద్దరిపైనా దాడి జరిగింది. 10 రోజుల క్రితం కూడా ఇదే విధంగా మరొకరిపై దాడి జరిగింది. మంగళవారం జరిగిన దాడి సంఘటనను పరోక్షంగా ప్రస్తావించారు.





