News

కాంగ్రెస్ ‘ఆధునిక ముస్లిం లీగ్‌’ , గెహ్లాట్ ఒక‌ ఔరంగజేబ్! : మండిప‌డ్డ‌ ఎంపీ తేజస్వి సూర్య

549views

దౌసా(రాజస్థాన్): భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎంపీ తేజస్వి సూర్య బుధవారం (ఏప్రిల్ 13) రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌ను మొఘల్ పాలకుడు ఔరంగజేబ్‌తో పోల్చారు. రాష్ట్ర ప్రభుత్వంపై దౌర్జన్యానికి పాల్పడిందని ఆరోపిస్తూ కాంగ్రెస్‌ను “ఆధునిక ముస్లిం లీగ్” అని పిలిచారు. ఎందుకంటే, హిందువుల‌పై నిరంత‌రం జ‌రుగుతున్న దాడుల‌కు వీరి ప్రోత్సాహం ఉంద‌ని మండిప‌డ్డారు.

క‌రౌలిలో శ్రీ‌రామ న‌వ‌మిని పుర‌స్క‌రించుకొని హిందువులు చేప‌ట్టిన ఊరేగింపుపై రాళ్ళ దాడి జ‌రిగింది. ఎంతోమంది అమాయిక హిందువులు గాయాల‌పాల‌య్యారు. బాధితుల‌ను ప‌రామ‌ర్శించేందుకు బీజేపీ యువమోర్చా జాతీయ అధ్యక్షుడు సూర్య‌, పార్టీ రాజస్థాన్ చీఫ్ సతీష్ పూనియా, భారతీయ జనతా యువమోర్చా (బీజేవైఎం) కార్యకర్తలు, ఇతరులను మత హింసాకాండకు గురైన కరౌలీలోకి ప్రవేశించకుండా బుధవారం అక్క‌డి ప్ర‌భుత్వం అడ్డుకుంది. పోలీసులు హిందౌన్-మహువా సరిహద్దు వద్ద అదుపులోకి తీసుకున్నారు.

అనంతరం విలేఖ‌రుల సమావేశంలో సూర్య మాట్లాడారు. ఔరంగజేబ్ స్థానాన్ని ఇప్పుడు అశోక్ గెహ్లాట్ కైవసం చేసుకున్నారని అన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ బుజ్జగింపు విధానానికి వ్యతిరేకంగా యువమోర్చా పోరాడుతుందని కూడా ఆయన అన్నారు.

“ఇది రాజస్థాన్… ఆఫ్ఘనిస్తాన్ కాదు. రాష్ట్ర ప్రభుత్వం హిందువులకు సెకండ్ గ్రేడ్ ట్రీట్‌మెంట్ ఇవ్వడం మానేయాలి… రాష్ట్ర హిందూ వ్యతిరేక, భారత వ్యతిరేక విధానాన్ని నేను ఖండిస్తున్నాను” అని బీజేవైఎం చీఫ్ అన్నారు. ఇంకా, “నేటి కాంగ్రెస్ ఆధునిక ముస్లిం లీగ్‌’ అని అన్నారాయన.

కాంగ్రెస్‌పై విరుచుకుపడిన సూర్య… “ఇండియన్ ముస్లిం లీగ్ హిందువులను ఎలా విభజించి, వారిపై దౌర్జన్యాలకు పాల్పడుతుందో, అదే విధంగా (కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు) సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, అశోక్ గెహ్లాట్ కూడా అదే సంప్రదాయాన్ని ఆధునికంగా కొనసాగిస్తున్నారు…’ అని విమ‌ర్శించారు.

దాదాపు 300 సంవత్సరాల క్రితం, ఔరంగజేబు దాడి చేసినప్పుడు హిందువులు మధురలోని మదన్ మోహన్ ఆలయం నుండి కరౌలికి విగ్రహాలను తీసుకువచ్చారని సూర్య చెప్పారు. కరౌలిలో తమకు రక్షణ లభిస్తుందని వారు ఆశించారని ఆయన తెలిపారు.

“రాష్ట్రంలో హిందువులపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయి” అని సూర్య నిప్పులు చెరిగారు. ఇక్కడ బాధితులు హింసించబడుతున్నారని, దోషులు స్కాట్-ఫ్రీగా తిరుగుతున్నారని అన్నారు.

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి