
-
సమాచార, ప్రసార శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ వెల్లడి
జమ్మూకశ్మీర్: జమ్మూకశ్మీర్‌లోని మారుమూల ప్రాంతాల కుటుంబాలకు దూరదర్శన్ డిష్ టీవీ సౌకర్యాలను ఉచితంగా అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచార, ప్రసార శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర తెలిపారు. ఆయన ఇటీవల కేంద్రపాలిత ప్రాంతంలో పర్యటించినప్పుడు ఈ విషయాన్ని ప్రకటించారు.
“డీడీ ఫ్రీ డిష్ ప్లాట్‌ఫారమ్ ద్వారా సుదూర, సరిహద్దు ప్రాంతాల్లో నివసించే ప్రజలను చేరుకోవాలనే లక్ష్యాన్ని సాధించడానికి, కేబుల్ సర్వీస్ లేని ప్రాంతాలలో 1.5 లక్షల ఉచిత డిష్ టీవీలను పంపిణీ చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించిందని” ఆయన తెలిపారు. “దానికి సంబంధించిన టెండరింగ్ ప్రక్రియ మొదలైంది.. అతి త్వరలో పూర్తవుతుంది” అని ఐ అండ్ బి మంత్రిత్వ శాఖ పత్రికా ప్రకటనలో పేర్కొంది.
అపూర్వ చంద్ర మాట్లాడుతూ శ్రీనగర్‌లోని దూరదర్శన్ కేంద్రానికి గతంలో అనేక సవాళ్లు ఎదురయ్యాయి. అయినప్పటికీ సమర్ధవంతంగా తన విధులను నిర్వర్తించినందుకు ప్రశంసించారు. కేంద్రం తన కార్యక్రమాల ద్వారా స్థానిక సంస్కృతి, సంప్రదాయాలకు ప్రాతినిధ్యం వహిస్తుందని, ప్రామాణికమైన సమాచారంతో ప్రజలకు చేరువవుతుందని ఆయన అన్నారు.
Source: NationalistHub





