
వాషింగ్టన్: భారత్‌కు చెందిన చమురు కంపెనీలు రష్యాతో డీల్ కుదుర్చుకోవడంపై కొందరు అనవసర రాద్ధాంతం చేసిన సంగతి తెలిసిందే..! ముఖ్యంగా అమెరికా కన్నెర్ర జేసిందంటూ పెద్ద ఎత్తున వార్తలు ప్రచారం అయ్యాయి. రష్యాపై ఆంక్షలు అమలవుతున్న నేపథ్యంలో రష్యా నుంచి భారత దేశం క్రూడాయిల్‌ను దిగుమతి చేసుకుని భారత్ ఆంక్షలను ఉల్లంఘించిందని ఆరోపించారు.
అయితే, భారత్ చేసిన పని ఆంక్షలను ఉల్లంఘించడం కిందకు రాదని అమెరికా స్పష్టం చేసింది. ఈ దిగుమతులు ప్రస్తుతానికి భారత్ దిగుమతి చేసుకుంటున్న మొత్తం చమురులో 1 నుంచి 2 శాతం వరకు మాత్రమే ఉన్నందువల్ల ఆంక్షలను ఉల్లంఘించినట్టు పరిగణించడం లేదని తెలిపింది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వర్చువల్ సమావేశం అనంతరం వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ జెన్ సాకీ మాట్లాడుతూ.. రష్యా నుంచి భారత్ కేవలం 1 నుంచి 2 శాతం చమురును మాత్రమే దిగుమతి చేసుకుంటోందని, అందువల్ల రష్యాపై విధించిన ఆంక్షలను భారత్ ఉల్లంఘించినట్టు పరిగణించడం లేదని అన్నారు.
Source: NationalistHub





