News

క‌శ్మీర్‌లో ఎన్‌.ఐ.ఎ సోదాలు!

319views

క‌శ్మీర్‌: క‌శ్మీర్ లోయలో హింసాత్మక ఘటనలు ఎక్కువైన సంగతి తెలిసిందే! లోయలో స్థానికేతరులు, కశ్మీరీ పండిట్‌లపై దాడులు చోటు చేసుకుంటూ ఉన్న సమయంలో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌.ఐ.ఏ) ఇటీవ‌ల‌ లోయలోని పలు ప్రదేశాలలో, ది రెసిస్టెన్స్ ఫోర్స్ (టి.ఆర్‌.ఎఫ్‌)కి చెందిన అనుమానిత కార్యకర్తల నివాసాలపై దాడులు నిర్వహించింది.

లోయలో బయటి వ్యక్తులపై ఇటీవల జరిగిన దాడుల వెనుక జైషే మహ్మద్‌తో పాటు లష్కరే కు చెందిన అనుబంధ సంస్థ, ది రెసిస్టెన్స్ ఫోర్స్ సంస్థ హస్తం ఉన్నట్టు అనుమానిస్తోంది. మొత్తం 11 ప్రదేశాలలో సోదాలు జరిగాయి.

శ్రీనగర్‌లోని ఆరు, బారాముల్లా 2, అవంతిపోరా 1, బుద్గామ్ 1, కుల్గామ్ ఒక‌చోట సోదాలు జరిగాయి. సజాద్ గుల్, టి.ఆర్‌.ఎఫ్‌. కమాండర్ అనుచరులు జమ్మూ కశ్మీర్ యువకులను రాడికలైజ్ చేయడం / రిక్రూట్ చేయడం / ప్రేరేపించడం వంటి అనే ఆరోపణలపై అధికారులు సోదాలను నిర్వహించారు. సెర్చ్ చేసిన ప్రదేశాలలో ఉగ్రవాది బాసిత్ అహ్మద్ దార్ ఇల్లు కూడా ఉంది. అతనిపై ఎన్‌.ఐ.ఎ ఇటీవల రూ. 10 లక్షల రివార్డును ప్రకటించింది.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి