News

హౌరాలో శ్రీ‌రామనవమి ఊరేగింపుపై ముస్లింల రాళ్ళ దాడి!

790views

కోల్‌క‌తా: పశ్చిమ బెంగాల్‌లోని హౌరాలో శ్రీ‌రామనవమి ఊరేగింపుపై రాళ్ళ దాడి జరిగింది. ముస్లింలు చేసిన దాడి కారణంగా భక్తులు ఊరేగింపును వదిలివేయవలసి వచ్చింది. ఈ దాడిలో పలువురు గాయపడ్డారు. హౌరా నగరానికి చెందిన ట్విట్టర్ వినియోగదారుల ప్రకారం, ముస్లిం గుంపు… ఊరేగింపుపై రాళ్ళు రువ్వింది. అంత జరుగుతూ ఉన్నా కూడా దాడిని ఆపడానికి పోలీసులు ఏమీ చేయలేదు.

విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్, దుర్గా బాహినీ ఆధ్వర్యంలో ఈ ఊరేగింపు జరిగింది. ఊరేగింపును శిబ్‌పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి ప్రారంభించారు. హౌరాలోని షిబ్‌పూర్‌లోని జీటీ రోడ్డులోని పీఎం బస్తీ వద్ద ఫజీర్ బజార్ సమీపంలో ఊరేగింపుపై దాడి జరిగింది. ఈ దాడి గురించి తెలియజేసేందుకు పశ్చిమ బెంగాల్ బీజేవైఎం వైస్ ప్రెసిడెంట్ ప్రియాంక శర్మ ట్విట్టర్‌లో ఒక వీడియోను పోస్ట్ చేశారు.

ఊరేగింపు వెళుతున్నప్పుడు తమపై రాళ్ళు రువ్వారని చెప్పారు. దాడి తర్వాత, పోలీసులు ఊరేగింపు చేస్తున్న వారిపై లాఠీ ఛార్జ్ చేశారని, ఆపై వారిని అరెస్టు చేశారని అన్నారు. అయితే, దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోలేదని ఆమె ఆరోపించారు. పశ్చిమ బెంగాల్‌లో హిందువుల పరిస్థితి చాలా దారుణంగా ఉందని, రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఆమె కోరారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి