News

వైభ‌వం… శ్రీ‌రామ శోభాయాత్ర‌

815views

గుంటూరు: శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకొని గుంటూరు పట్టణంలో స్థానిక శ్రీరామ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఆదివారం అత్యంత వైభ‌వంగా శ్రీ‌రామ శోభాయాత్ర‌ జ‌రిగింది. సుమారు అయిదు వేల మంది రామ‌, హ‌నుమ భ‌క్తులు పాల్గొన్నార‌ని నిర్వ‌హ‌కులు తెలిపారు. ఊహించని రీతిలో కార్యక్రమాన్ని జయప్రదం చేసిన హిందూ బంధువులందరికీ ఉత్సవ సమితి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నామ‌ని వారు ఓ ప్ర‌క‌ట‌న జారీ చేశారు.

అలాగే, ఈ ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మం జ‌య‌ప్ర‌దం చేయ‌డానికి తమ వంతు కృషి చేసిన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, సోష‌ల్ మీడియా, ఇత‌ర కార్య‌క‌ర్త‌ల‌కు ఈ సంద‌ర్భంగా నిర్వ‌హ‌కులు పేరుపేరునా కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. శోయాయాత్ర‌లో ఎటువంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు చోటుచేసుకోకుండా స‌హ‌క‌రించిన స్థానిక పోలీసువారికి ఉత్సవ సమితి, హిందూ సమాజం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి